జోన్ల వ్యవస్థపై విమర్శించిన కోదండరాం..

     Written by : smtv Desk | Fri, May 25, 2018, 03:58 PM

జోన్ల వ్యవస్థపై విమర్శించిన కోదండరాం..

హైదరాబాద్, మే 25 : రాష్ట్రంలో జోన్ల వ్యవస్థ తొందరపాటు నిర్ణయమని, ప్రభుత్వం అనాలోచితంగా జోన్ల వ్యవస్థను తీసుకువచ్చిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. కంది మండల కేంద్రంలో నేడు పార్టీ జెండాను ఆవిష్కరించిన కోదండరాం ఈ సందర్భంగా మాట్లాడారు. జోన్ల వ్యవస్థపై అధికారుల నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పన్ను వసూలు చేస్తున్నందున వాహనదారులు పక్క రాష్ట్రాల్లోనే పెట్రోల్‌, డీజిల్‌ పోయించుకుంటున్నారని వెంటనే ధరలు తగ్గించాలన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గిస్తే వినియోగదారుల మీద భారం తగ్గుతుందని పేర్కొన్నారు. నిత్యవసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయని.. దీనిపై ప్రభుత్వాలు వెంటనే దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీజేఎస్‌ పార్టీని బలోపేతం చేస్తామని, రానున్న సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా కోదండరాం సమక్షంలో పలువురు తెలంగాణ జన సమితి పార్టీలో చేరారు.

Untitled Document
Advertisements