విద్యార్ధులకు క్షమాపణలు చెప్పిన మోదీ..

     Written by : smtv Desk | Fri, May 25, 2018, 04:43 PM

విద్యార్ధులకు క్షమాపణలు చెప్పిన మోదీ..

కోల్‌కతా, మే 25 : ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవరం విద్యార్థులకు క్షమాపణ చెప్పారు. విశ్వభారతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సందర్భంగా ఆయన శాంతినికేతన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు ఆయన మాట్లాడుతూ "అన్నిటికన్నా ముందు, విశ్వభారతి విశ్వవిద్యాలయం ఛాన్సలర్ హోదాలో నేను క్షమాపణలు చెప్తున్నాను. నేను వస్తున్నపుడు కొందరు విద్యార్థులు సైగలు చేశారు, తమకు తాగునీటి ఏర్పాట్లు చేయలేదని చెప్పారు. మీకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్తున్నాను" అన్నారు.

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక​ హసీనా కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఇరు ప్రధానులతోపాటు సీఎం మమతా బెనర్జీ వేదికను పంచుకున్నారు. అంతకు ముందు ప్రధాని మోదీకి స్వ​యంగా మమతా ఆహ్వానం పలికి, యూనివర్సిటీకి వెంటబెట్టుకొచ్చారు.





Untitled Document
Advertisements