'మహానటి'లో అవకాశం నా అదృష్టం..

     Written by : smtv Desk | Fri, May 25, 2018, 05:38 PM

'మహానటి'లో అవకాశం నా అదృష్టం..

హైదరాబాద్, మే 25 : అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన "మహానటి" చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 9 వ తేదీన రిలీజ్ అయింది. ఈ చిత్రంపై సినీ ప్రముఖులంతా ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా మహా అద్భుతం అంటూ ప్రతి ఒక్కరు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. విడుదలైన నాటి నుండి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ తన సత్తా చాటుతోంది.

ఈ నేపథ్యంలో నిర్మాతలు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. దర్శక నిర్మాతలతో పాటు కీర్తి సురేశ్.. విజయ్ దేవరకొండ.. రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ.. సావిత్రి గారి పాత్రను చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు నాగ్ అశ్విన్.. నిర్మాతలుగా స్వప్న దత్.. ప్రియాంక దత్ లు నాకు ఎంతగానో సహకరించారు. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కష్టపడటం వల్లనే ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ను నేను ఎప్పటికీ మరచిపోలేను" అని చెప్పుకొచ్చింది.





Untitled Document
Advertisements