నాగ్ ఫాన్స్ కు ఇదే నా ఆహ్వానం..

     Written by : smtv Desk | Fri, May 25, 2018, 06:20 PM

నాగ్ ఫాన్స్ కు ఇదే నా ఆహ్వానం..

హైదరాబాద్, మే 25 : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. నాగార్జున కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం "ఆఫీసర్". నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత వర్మ, నాగ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగార్జున సరసన మైరా శరీన్ నటిస్తుండగా, నాగ్ కుమార్తెగా చిన్నారి కావ్య నటిస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన 'నవ్వే నువ్వు..' అని సాగే పాట ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. మొత్తం 3.4 లక్షల మంది ఈ పాటను వీక్షించారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించి వర్మ ఓ ట్వీట్ చేశారు. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకను ఈ నెల 28 వ తేదీ రాత్రి ఏడు గంటలకు ఎన్ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అభిమానులందరిని ఆహ్వానిస్తూ.. "నాగార్జున ఫ్యాన్స్ అందరికీ ఇదే నా ఆహ్వానం. దయచేసి ఈ వేడుకలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నా. ఈ చిత్రాన్ని జూన్ 1న విడుదల చేస్తున్నాం" అని వర్మ ట్వీట్ చేశారు.

Untitled Document
Advertisements