రషీద్ ఖాన్ పై ప్రసంశల జల్లు..

     Written by : smtv Desk | Sat, May 26, 2018, 11:54 AM

రషీద్ ఖాన్ పై ప్రసంశల జల్లు..

హైదరాబాద్, మే 26 : రషీద్ ఖాన్.. రషీద్ ఖాన్.. ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో వినిపిస్తున్న పేరు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సంచలం, యువకెరటం రషీద్‌ ఖాన్‌ అల్ రౌండర్ గా ప్రతిభ చూపి హైదరాబాద్ జట్టుకు విజయాన్ని అందించాడు. మొదట బ్యాట్ తో చెలరేగిన అతను.. తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్ లో కూడా సత్తా చాటాడు. శుక్రవారం కొల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ 10 బంతుల్లో 34 పరుగులు చేయడమే కాక.. 3 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఈ సంచలన స్పిన్నర్ ఆటతీరుపై సర్వత్రా ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి.

దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అతని ఆట తీరు కొనియాడుతూ.. ట్వీట్‌ చేశారు. "రషీద్‌ మంచి బౌలర్‌ మాత్రమే అనుకున్నాను. ప్రస్తుతం అతను ఈ ఫార్మట్‌లో ప్రపంచంలోనే గొప్ప స్పిన్నర్‌ అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అతనిలో బంతితో కాకుండా బ్యాట్‌తో రాణించగల ప్రతిభ ఉంది. గ్రేట్‌ గాయ్‌" అని సచిన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తన తరపున రషీద్‌ ఖాన్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అద్భుతంగా ఆడిందని, రషీద్‌ ఖాన్‌తో పాటు జట్టు మొత్తానికి అభినందనలు చెప్పారు. తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ సైతం మ్యాచ్‌పై స్పందించారు. మ్యాచ్‌ చూడలేపోయానని చెప్పిన ఆయన, ట్రోఫీ అందుకోవాలంటూ ఆకాంక్షించారు. రషీద్‌ గురించి కొందరి ప్రముఖుల ట్వీట్లు..




























Untitled Document
Advertisements