మా లవ్ ఎందుకు బ్రేకప్ అయిందంటే..!!

     Written by : smtv Desk | Sat, May 26, 2018, 01:17 PM

మా లవ్ ఎందుకు బ్రేకప్ అయిందంటే..!!

హైదరాబాద్, మే 26 : హీరోయిన్ నికిషా పటేల్.. తన ప్రేమ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇటీవల సినిమాలకు దూరమైన ఈ భామ.. పలు ఇంటర్వ్యూల ద్వారా ప్రేక్షకులను పలరిస్తూ వస్తోంది. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ తన సినిమాలు, తన లవ్ బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది. తానూ ఒక వ్యక్తిని ప్రేమించానని.. పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నానని తెలిపారు. ఎప్పుడైతే సినిమాల్లోకి రావాలనుకున్నానో.. అప్పుడు తన లవ్ బ్రేకప్ అయిందని తెలిపింది.

తను ప్రేమించిన వ్యక్తికి సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని.. సినిమాల్లోకి వెళ్తే మన పెళ్లి జరగదని కచ్చితంగా చెప్పేశాడని తెలిపింది. దీంతో తను సినిమాల్లోకే రావడానికి సుముఖత చూపడంతో ఇద్దరం ఫ్రెండ్లీగానే విడిపోయామని చెప్పింది. సినిమాల్లోకి వచ్చినా పూర్తిగా సక్సెస్ కాలేకపోయానని.. అయినా బాధపడడం లేదన్నారు. ఇప్పుడు ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్నానంది. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే, అప్పుడు తప్పకుండా చేసుకుంటానని చెప్పుకొచ్చింది.

Untitled Document
Advertisements