మోదీ నాలుగేళ్ల పాలనకు నివేదిక ఇచ్చిన రాహుల్..

     Written by : smtv Desk | Sat, May 26, 2018, 02:55 PM

మోదీ నాలుగేళ్ల పాలనకు నివేదిక ఇచ్చిన రాహుల్..

న్యూఢిల్లీ, మే 26 : నరేంద్ర మోదీ ప్రధాని మంత్రిగా అధికారం చేపట్టి ఈ రోజుతో నాలుగేళ్లు గడిచాయి. 2014 మే 26న నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనను గద్దె దించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధించింది. ఈ నాలుగేళ్ల కాలంలో మోదీ ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్టీ వంటి పలు విధానాలను ప్రవేశపెట్టారు. నరేంద్ర మోదీ నాలుగేళ్ల పరిపాలనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ పరీక్షా నివేదికను ట్విట్టర్లో పెట్టారు.

ఈ నివేదికలో మోదీ ప్రభుత్వంకు వ్యవసాయం, విదేశీ విధానాలు, ఇంధన ధరలు, ఉద్యోగ కల్పనకు గాను 'F' గ్రేడ్ ను ఇచ్చారు. నినాదాలు ఇవ్వడంలో, గొప్పలు చెప్పుకోవడంలో A+ను, యోగాలో B- గ్రేడ్ ను ఇస్తూ ఒక ట్వీట్ చేశారు. అంతే కాకుండా రిమార్క్సలో మోదీ ఏకాగ్రత లేమి, క్లిష్టసమస్యలతో బాధపడుతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.Untitled Document
Advertisements