'ఐపీఎల్' @ 180 కోట్ల సార్లు...

     Written by : smtv Desk | Sat, May 26, 2018, 04:48 PM

'ఐపీఎల్' @ 180 కోట్ల సార్లు...

ఢిల్లీ, మే 26 : ఐపీఎల్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన టోర్నీ అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుత ఐపీఎల్-11 సీజన్ రసవత్తరంగా సాగుతుంది. తాజాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎక్కువగా ఐపీఎల్‌ గురించే వెతికారని ఓ సంస్థ గణాంకాలు విడుదల చేసింది. ఈ గణాంకాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఈ ఏడాది ఐపీఎల్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారట. మ్యాచ్‌ల సమాచారం కోసం ఐపీఎల్‌ అన్న పదం ఉపయోగించి ఎన్నిసార్లు వెతికారో తెలుసా? 180 కోట్ల సార్లు. అంకెలు వింటుంటేనే ఆశ్చర్యపోతున్నారా? ‘ఎస్‌ఈఎమ్‌రష్‌’ నిర్వాహకులు చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. గత ఏడాది లక్షల్లో ఉన్న ఈ సంఖ్య ఏకంగా కోట్లల్లోకి దూసుకెళ్లింది. ఈ రెండేళ్ల మధ్య ఇప్పటికే భారీ తేడా ఉంది. కాగా ఈ సీజన్‌ ఇక ఫైనల్‌ దశకు చేరుకుంది.

ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య ముంబయిలోని వాంఖడే మైదానంలో ఫైనల్ సమరం జరగనుంది. ఈ మ్యాచ్‌ ముగిసేలోపు ఇంకా ఎన్నిసార్లు ఐపీఎల్‌ గురించి వెతుకుతారో చూడాలి మరి. గత సంవత్సరం ఏప్రిల్‌లో ఐపీఎల్‌ పదాన్ని8,23,000 సార్లు వినియోగించగా, ఈ ఏడాది అది గణనీయంగా పెరిగింది. ఈ ఫలితాలు చూసి మేమే ఆశ్చర్యపోయాం. 'ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో 180 కోట్లసార్లు ఐపీఎల్‌ పదం ఉపయోగించి నెటిజన్లు కావాల్సిన సమాచారం కోసం వెతికారు' అని నిర్వాహకులు వెల్లడించారు.

Untitled Document
Advertisements