అంధుడిగా ఆదిపినిశెట్టి..!!

     Written by : smtv Desk | Sat, May 26, 2018, 05:13 PM

అంధుడిగా ఆదిపినిశెట్టి..!!

హైదరాబాద్, మే 26 : "రంగస్థలం"లో కుమార్ బాబుగా ప్రేక్షకులకు మరింత చేరువైన హీరో ఆది పినిశెట్టి. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఆది ప్రస్తుతం "నీవెవరో" చిత్రంలో నటిస్తున్నాడు. హరినాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇటీవల ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే ఆది ఈ చిత్రంలో ఒక ఛాలెంజింగ్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అంధుడిగా చెఫ్‌ పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం సాగుతోంది. విభిన్నమైన కథతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌ కానిస్టేబుల్‌గా నటిస్తున్నారట. ఆది పినిశెట్టి సరసన తాప్సి, రితికా సింగ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

Untitled Document
Advertisements