'పతంజలి' నష్టాలకు కారణం.. నోట్ల రద్దు, జీఎస్టీనంటా..

     Written by : smtv Desk | Sat, May 26, 2018, 05:13 PM

'పతంజలి' నష్టాలకు కారణం.. నోట్ల రద్దు, జీఎస్టీనంటా..

న్యూఢిల్లీ, మే 26 : విదేశీ ఉత్పత్తులకు ధీటుగా మార్కెట్ లోకి ప్రవేశించిన 'పతంజలి' కంపెనీ మంచి పేరుతో పాటు, లాభాలను కూడా అదే విధంగా సాధించింది. కాగా వినియోగ ఉత్పత్తుల రంగంలో ఆయుర్వేద, సహజ ఉత్పత్తులతో శరవేగంగా దూసుకుపోతున్న పతంజలి కంపెనీకి ఊహించని బ్రేక్‌ పడింది. 2009లో వినియోగ ఉత్పత్తుల ఆయుర్వేద కంపెనీని ఏర్పాటు చేసిన నాటి నుంచి లాభాలతో అప్రతిహతంగా దూసుకుపోతున్న పతంజలి కంపెనీ 2018 సంవత్సరానికి తన లాభాలు రెట్టింపు అవుతాయని అనుకొంది. కానీ 2017లో సాధించిన ఉత్పత్తుల టర్నోవర్‌ 10, 500 కోట్ల రూపాయల వద్దనే ఉండిపోయింది. 2018 సంవత్సరంలో కంపెనీ టర్నోవర్‌ ఒక్క పైసా కూడా పెరగలేదు.

ఈ విషయంపై పతంజలి కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆచార్య బాలకష్ణ మీడియాతో మాట్లాడుతూ.."వ్యక్తిగత వినియోగం నుంచి గృహావసరాలు, ఆహార పదార్థాల వరకు దాదాపు వెయ్యి ఉత్పత్తులను పతంజలి సంస్థ విక్రయిస్తోంది. ప్రధాని మోదీ దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడం, జీఎస్టీ పన్నును ప్రవేశ పెట్టడం వల్ల మా కంపెనీ ఎలాంటి పురోగతి సాధించలేకపోయాం" అని అన్నారు. ఈసారి టర్నోవర్‌ పెరగకపోవడానికి పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని కంపెనీ సాకుగా చూపిస్తోందని, వాటి ప్రభావం చాల తక్కువని టెక్నోపాక్‌ కన్సల్టింగ్‌ సంస్థ ఉపాధ్యక్షుడు అంకూర్‌ బైసన్‌ తెలిపారు.





Untitled Document
Advertisements