నిరుద్యోగ భృతి పై కీలక నిర్ణయం ..!

     Written by : smtv Desk | Thu, May 31, 2018, 08:32 PM

నిరుద్యోగ భృతి పై కీలక నిర్ణయం ..!

అమరావతి, మే 31 : రాష్ట్రంలో మొత్తం 10లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. నెలకు రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయించింది. ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 3గంటల నుంచి మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సమావేశంలో ఎక్కువ అంశాలు భూకేటాయింపులకు సంబంధించే ఉన్నప్పటికీ నిరుద్యోగ భృతి అంశంపైనే కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నిరుద్యోగ భృతి చెల్లింపునకు కనీస అర్హతను డిగ్రీగా పరిగణించాలని నిర్ణయించారు. జూన్‌ నెల నుంచే నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటే చంద్రబాబు పలు వేదికలపై ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.





Untitled Document
Advertisements