కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనదాయిని : కేసీఆర్‌

     Written by : smtv Desk | Sat, Jun 02, 2018, 01:31 PM

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనదాయిని : కేసీఆర్‌

హైదరాబాద్‌, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్‌ హాజరై... తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు చెబుతూ కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.." తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పిస్తున్న. రాష్ట్రం అవతరించి ఈ రోజుకి నాలుగేళ్లు. బంగారు తెలంగాణ దిశగా ఈ నాలుగేళ్లు అడుగులు వేశాం. ఉజ్జ్వల భవిష్యత్ ఉండే విధంగా ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల కింద పేద ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక సాయం చేస్తున్నాం" అని కేసీఆర్ కేసిఆర్ పేర్కొన్నారు.

"వసతి గృహ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నాం. రైతులకు రుణమాఫీ చేశాం, వ్యవసాయ పరికరాలకు రాయితీ ఇచ్చాం. గోదావరి, కృష్ణా జలాలు పొలాల్లో పారేలా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాం. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనదాయిని కానుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా వేగంగా, ఆధునిక పరిజ్ఞానంతో కాళేశ్వరం నిర్మిస్తున్నాం. కేంద్ర జలసంఘం సభ్యులు కూడా కాళేశ్వరం నిర్మాణాన్ని మెచ్చుకున్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి తెరాస ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది" అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

అన్నదాత జీవితాల్లో వెలుగు..

"సాగుపెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయాల్సిన అవసరం తప్పింది. రైతుల కోసం మరెంతో చేయాలనే తపన నాలో పెరిగింది. అన్నదాతలను అప్పుల ఊబి నుంచి బయటపడేయాలనేదే నా లక్ష్యం. ఎకరాకు రూ.8 వేల పెట్టుబడిసాయం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కొందరు ధనిక రైతులు రైతుబంధు చెక్కులు వదులుకొని స్ఫూర్తిగా నిలిచారు. మరికొందరు రైతులు రైతుబంధుకు విరాళాలు ఇచ్చి తమ మంచి మనసు చాటుకున్నారు" అని సీఎం అన్నారు.





Untitled Document
Advertisements