జగన్ పై పరోక్షంగా విమర్శలు చేసిన లోకేష్..

     Written by : smtv Desk | Mon, Jun 04, 2018, 06:33 PM

జగన్ పై పరోక్షంగా విమర్శలు చేసిన లోకేష్..

అమరావతి, జూన్ 4 : ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పరోక్షంగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆయన పార్టీలోని నేతలంతా మర్డర్లు, కిడ్నాపులు, అత్యాచారాలు, భూకబ్జాలు, ఎర్రచందనం స్మగ్లింగ్, బెట్టింగ్, దోపిడీ లాంటి అన్ని నేరాల్లో ఉన్నారని తీవ్రంగా ఆరోపించారు. ఇంత చరిత్ర ఉన్న ఆ వ్యక్తి ఏపీలోని నేరాల గురించి మాట్లాడడం విడ్డురంగా ఉందని లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ తండ్రి హయాంలో ఉన్న క్రైమ్ రేటును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కుపాదంతో అణచివేశారని లోకేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

"13 కేసుల్లో ఏ1గా ఉండి కండిషనల్‌ బెయిల్‌పై బయట తిరుగుతున్న వ్యక్తి ఏపీలో నేరాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆయన కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియాగా పేరుకెక్కిన ఘనత ఆయనది. ఆ పార్టీలో కిడ్నాపర్లు, బెట్టింగ్ రాయుళ్లు, ఎర్రచందనం స్మగ్లర్లు, భూకబ్జాదారులు, అత్యాచారాలకు పాల్పడే వ్యక్తులు ఉన్నారు. ఆయన తండ్రి కాలంలో జరిగిన నేరాల గురించి ఆ వ్యక్తికి తెలియదా..!ఆ సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడింది సీఎం చంద్రబాబునాయుడే" లోకేష్ ట్వీట్ చేశారు.













Untitled Document
Advertisements