అద్భుతమైన ఫీచర్లతో 'మోటో జీ6 ప్లే'..

     Written by : smtv Desk | Mon, Jun 04, 2018, 06:34 PM

అద్భుతమైన ఫీచర్లతో 'మోటో జీ6 ప్లే'..

హైదరాబాద్, జూన్ 4 : మోటోరోలా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నుండి మరో కొత్త మొబైల్ ను ఆవిష్కరించారు. 'మోటో జీ6 ప్లే'ను మోటో కంపెనీ నేడు రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.7 ఇంచుల భారీ డిస్‌ప్లే తో పాటు.. ముందు భాగంలో ఉన్న 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాకు ఫ్లాష్ సదుపాయం కల్పించారు. వెనుక భాగంలో కెమెరా కింద ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. అలాగే 4000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఇండిగో బ్లాక్, ఫైన్ గోల్డ్ కలర్ వేరియెంట్లలో లభిస్తున్న ఈ ఫోన్ రూ.11,999 ధరకు వినియోగదారులకు ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభ్యమవుతోంది.

>> మోటో జీ6 ప్లే ఫీచర్లు...
* 5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 4జీ వీవోఎల్‌టీఈ
* 3 జీబీ ర్యామ్
* 32 జీబీ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
* 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
* 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్)
* ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ ఆడియో
* బ్లూటూత్ 4.2
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
* టర్బో చార్జింగ్
* 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్





Untitled Document
Advertisements