అదృష్టం అంటే ఆ పీత దే..!!

     Written by : smtv Desk | Mon, Jun 04, 2018, 07:18 PM

అదృష్టం అంటే ఆ పీత దే..!!

చైనా, జూన్ 4 : సాధారణంగా ఏదైనా పెద్ద ప్రమాదం నుండి బయటపడినప్పుడు అదృష్టం అంటే వీడిదిరా అంటుంటారు. ఇంకా వాడికి భూమ్మీద నూకలు ఉన్నాయంటూ చెప్పుకుంటారు. అందుకు నిదర్శనం చైనాలోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన సంఘటనే. ఆ రెస్టారెంట్‌లో వంట వండుతుండగా.. దాదాపు తినడానికి సిద్ధమైన వేడి వేడి రసంలో నుంచి ఓ పీత బయటపడి తన ప్రాణాలను దక్కించుకుంది.

మరుగుతున్న రసంలోంచి పాత్ర పై భాగానికి చేరుకున్న పీత అందులోంచి బయటపడ్డానికి తీవ్రంగా ప్రయత్నించింది. చివరకు విజయం సాధించింది. దీంతో అక్కడ ఉన్న వార౦తా ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం ఆ పీత అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా రెస్టారెంట్‌ సిబ్బంది పట్టుకున్నారు. తిరిగి దానిని వండేందుకు సిద్దపడ్డారు. కానీ జూక్‌ అనే వ్యక్తి దానిని పెంచుకోవడానికి ముందుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు ఓ లుక్కేయండి..

Untitled Document
Advertisements