చైనాలో విషాదం..

     Written by : smtv Desk | Wed, Jun 06, 2018, 06:43 PM

చైనాలో విషాదం..

బీజింగ్, జూన్ 6 ‌: చైనా ఇనుప గనుల్లో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈశాన్య చైనా ప్రాంతంలోని లియోనింగ్‌ ప్రావిన్స్‌లో ఇనుప ఖనిజ ప్రాజెక్టు వద్ద జరిగిన ఈ పేలుడు ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. తొమ్మిది మంది క్షతగాత్రులయ్యారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. ఈ పేలుళ్లతో గనిలో చిక్కుకున్న 23 మంది కార్మికులను అధికారులు కాపాడారు. పేలుడు ధాటికి సుమారు వెయ్యి మీటర్ల మేర గని ధ్వంసమైందని అక్కడి అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు చెప్పారు. ఘటనపై వివరాలు మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Untitled Document
Advertisements