ఆపరేషన్ సక్సెస్..

     Written by : smtv Desk | Wed, Jun 06, 2018, 07:24 PM

ఆపరేషన్ సక్సెస్..

హైదరాబాద్, జూన్ 6 : సాధారణంగా ఆపరేషన్ అంటే మనుషులకు చేస్తుంటారు. కాని ఇక్కడ ఓ కుక్కకు ఆపరేషన్ నిర్వహించారు. ఓ కుక్క చెవి కమ్మలు మిగిందని దానికి అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. అసలు విషయం ఏంటంటే.. కరీంనగర్ జిల్లాలోని బ్రామ్మన వాడకు చెందిన గీత, సీతారామారావు కుటుంబం ఓ కుక్కను పెంచుకుంటోంది. పదినెలలుగా వీరివద్దనే ఉంటోంది. తమ కుక్కకు ఏ సమస్య వచ్చిన ఆ కుటుంబం తట్టుకోలేక దానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ కుక్క ఉన్నట్టుండి కుర్చీలో ఉంచిన చెవికమ్మలను మింగేసిందట. అయితే ఈ విషయం కుటుంబ సభ్యులు గమనించలేదు.

ఆ కుక్క ఏం తిన్నా వా౦తులు చేసుకుంటోంది. క్రమంగా నీరసించిపోతోంది. కుక్క ఆరోగ్యంపై అనుమానం వచ్చిన సదరు కుటుంబీకులు పశువైద్యులను సంప్రదించారు. దీంతో కుక్కకు ఎక్స్ రే నిర్వహించిన వైద్యులు కుక్క కడుపులో రింగు ఉన్నట్లు గమనించారు. కుక్కకు ఆపరేషన్ నిర్వహించాల్సి వస్తోందని చెప్పడంతో ఆ కుక్క యజమాని దానికి అంగీకరించారు. ఎట్టకేలకు కుక్కకు శస్త్రచికిత్స నిర్వహించి కుక్క ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం కుక్క క్షేమంగా ఉందని.. మరి కొన్ని రోజులు దానికి వైద్యం అందించనున్నట్లు డాక్టర్స్ తెలిపారు. కుక్క ప్రాణాలు కాపాడినందుకు ఆ యజమాని దంపతులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.





Untitled Document
Advertisements