ప్రతిపక్షాలు విమర్శలు మానుకోండి..

     Written by : smtv Desk | Thu, Jun 07, 2018, 04:48 PM

ప్రతిపక్షాలు విమర్శలు మానుకోండి..

హైదరాబాద్, జూన్ 7 : కాంగ్రెస్‌ నేతలు ప్రతి విషయంపైన చిల్లరగా మాట్లాడి ప్రజల ముందు నవ్వులపాలు కావొద్ద౦టూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి చేసే ప్రతి పనినీ విమర్శించడం మానుకొని... నిర్మాణాత్మక సూచనలు ఇచ్చి ప్రధాన ప్రతిపక్షం పరిణితితో వ్యవహరించాలని సూచించారు. సచివాలయంలో ఉపాధ్యాయ బదిలీలపై రూపొందించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కడియం.. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. 2019 లో అధికారంలోకి వస్తామనుకోవడం కాంగ్రెస్ నాయకుల భ్రమ అని.. ఆ భ్రమలోనే బ్రతుకుతు౦దన్నారు. ఇప్పటికైనా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అనుచితంగా మాట్లాడి నవ్వులపాలు కావొద్దంటూ పేర్కొన్నారు. కాగా ఉపాధ్యాయ బదిలీలపై ఓ షెడ్యూల్ రిలీజ్ చేశారు.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

* ఆన్‌లైన్‌ దరఖాస్తులను నేటి నుండి ఈ నెల 10 వరకు స్వీకరించనున్నారు.
* ఈ నెల 9న ఖాళీల జాబితాను అధికారులు వెలువరించనున్నారు.
* 10, 11 తేదీల్లో ఖాళీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.
* జూన్‌ 20 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌లో వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు.
* బదిలీల తుది జాబితాను ఈ నెల 26న విడుదల చేయనున్నారు.





Untitled Document
Advertisements