నోట్లరద్దు సమయం కంటే.. ఇప్పుడే ఎక్కువ...

     Written by : smtv Desk | Sun, Jun 10, 2018, 12:59 PM

నోట్లరద్దు సమయం కంటే.. ఇప్పుడే ఎక్కువ...

ఢిల్లీ, జూన్ 10 : ప్రస్తుతం ప్రజల వద్ద ఉన్న కరెన్సీ రికార్డు స్థాయికి చేరుకుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డేటా ప్రకటించింది. దేశంలోని ప్రజల వద్ద ఉన్న కరెన్సీ విలువ అక్షరాలు రూ. 18.5లక్షల కోట్లు.. ఉన్నట్లు ఈ మేరకు ఆర్‌బీఐ డేటా వెల్లడించింది. ప్రస్తుతం ప్రజల అంతేగాక.. నోట్లరద్దు నాటితో పోలిస్తే అది రెట్టింపైందని పేర్కొంది. సాధారణంగా మొత్తం చలామణిలో ఉన్న కరెన్సీ నుంచి బ్యాంకుల వద్ద ఉన్న నగదును తీసేసి.. ప్రజల వద్ద ఉన్న కరెన్సీని లెక్కిస్తారు. ఈ విధంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజల వద్ద ఉన్న కరెన్సీ రూ. 18.5లక్షల కోట్లకు చేరింది.

2016 నవంబరులో నోట్ల రద్దు చేసిన తర్వాత ప్రజల వద్ద రూ. 7.8లక్షల కోట్ల కరెన్సీ ఉంది. ఇప్పుడు అది రెట్టింపుకు పైగా పెరిగిందని ఆర్‌బీఐ తెలిపింది. ఇక ఆర్‌బీఐ చలామణిలోకి తీసుకొచ్చిన కరెన్సీ విలువ కూడా పెరిగింది. నోట్ల రద్దు తర్వాత రూ. 8.9లక్షల కోట్ల విలువైన కరెన్సీ చలామణిలో ఉండగా.. ప్రస్తుతం అది రూ. 19.3లక్షల కోట్లకు పెరిగింది. ఇక నోట్ల రద్దుకు ముందు ప్రజల వద్ద రూ. 17లక్షల కోట్ల విలువైన కరెన్సీ ఉందని ఆర్‌బీఐ తెలిపింది.

రూ. 500, రూ. 1000 నోట్లను బ్యాన్ చేస్తూ 2016 నవంబరు 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పాతనోట్లను బ్యాంకులో జమ చేసేందుకు ప్రభుత్వం కొంత గడువు ఇచ్చింది. ఆర్‌బీఐ డేటా ప్రకారం.. నోట్ల రద్దు సమయంలో మొత్తం రూ. 15.44లక్షల కోట్ల విలువైన రూ. 500, రూ. 100 నోట్లు చలామణిలో ఉన్నాయి. జూన్‌ 30, 2017 నాటికి అందులో 98.96శాతం అంటే రూ. 15.28లక్షల కోట్లు తిరిగి బ్యాంకులను చేరాయి. నోట్ల రద్దు తర్వాత రూ. 2000, రూ. 200, రూ. 500 కొత్త నోట్లను ఆర్‌బీఐ చలామణిలోకి తెచ్చింది. నోట్ల రద్దు తర్వాత డిసెంబరు 9,2016 నాటికి రూ. 7.8లక్షల కోట్ల కరెన్సీ ప్రజల వద్ద ఉంది. మే 25, 2018 నాటికి అది రూ. 18.5లక్షల కోట్లకు పెరిగింది.





Untitled Document
Advertisements