అందుకే టాప్ ఆర్డర్ లో వచ్చా..!

     Written by : smtv Desk | Tue, Jun 12, 2018, 06:17 PM

అందుకే టాప్ ఆర్డర్ లో వచ్చా..!

ముంబై, జూన్ 12 : ఐపీఎల్‌-11 సీజన్ విజేతగా ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిలిచిన విషయం తెలిసిందే. అద్భుతమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌ లైనప్‌తో ఉన్న చెన్నై మూడోసారి ఐపీఎల్‌ ట్రోఫీని దక్కించుకొంది. ధోనీ కూడా బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించాడు. 150 స్ట్రైక్‌రేట్‌తో 455 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. ధోనీ ఇదే ఫామ్‌తో వచ్చే ఏడాది ప్రపంచకప్‌లో రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. టీ20ల్లో లోయర్‌ ఆర్డర్‌లో వచ్చే ధోనీ ఐపీఎల్‌లో తన స్థానాన్ని మార్చుకున్నాడు. టాప్‌ ఆర్డర్‌లో వచ్చి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

తాజాగా ఈ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై ధోనీ స్పందిస్తూ.. "ఐపీఎల్‌లో టాప్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయాలని ముందే అనుకున్నాను. లోయర్‌ ఆర్డర్‌లో వస్తే స్టేడియంలో ఎక్కువ సయమం ఉండేందుకు కుదరదు. అందుకే మ్యాచ్‌లో ఉన్న ఓవర్లను బట్టి నేను 3, 4, 5 స్థానాల్లో బ్యాటింగ్‌ చేసేందుకు వచ్చాను. ఒకవేళ నేను వెంటనే ఔటైనా ఆ తర్వాతి వాళ్లు ఇన్నింగ్స్‌ చక్కదిద్దే సమయం ఉంటుందని భావించా. రైనా, వాట్సన్‌, రాయుడు, బ్రావో బాగా ఆడారు. అందుకే ఫైనల్‌లో తలపడే జట్టులో మార్పులు చేయాలని అనుకోలేదు" అని ధోనీ వ్యాఖ్యానించాడు.





Untitled Document
Advertisements