జయనగర్ లో కాంగ్రెస్ ఆధిక్యం..

     Written by : smtv Desk | Wed, Jun 13, 2018, 11:26 AM

జయనగర్ లో కాంగ్రెస్ ఆధిక్యం..

బెంగుళూరు, జూన్ 13 : కర్ణాటకలోని జయనగర అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తుంది. . జయనగర బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ అకస్మికంగా మరణంతో ఇక్కడ మే 12న జరగాల్సిన ఎన్నికలు వాయిదాపడ్డాయి. దీంతో ఎన్నికల కమిషన్‌ ఈ స్థానానికి తిరిగి జూన్‌ 11న( సోమవారం) ఎన్నికలు నిర్వహించగా 55శాతం పోలింగ్‌ నమోదైంది. కాగా ఈ రోజు కౌంటింగ్ సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మాజీ హోం మంత్రి రామలింగారెడ్డి తనయ సౌమ్యారెడ్డి పోటీలో ఉండటంతో ఈ నియోజకవర్గం ఫలితం మరింత ఆసక్తిదాయకంగా మారింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు సౌమ్యా రెడ్డి దాదాపు 13 వేల ఓట్ల మెజారిటీతో సాగుతున్నారు. తన సమీప బీజేపీ అభ్యర్థి ప్రహ్లాదపై ఆమె ఈ మెజారిటీని సాదించారు.

దాదాపు 1,11,000 వేల ఓట్లు పోల్ అయిన ఈ ఎన్నికలో ఇప్పటి వరకూ సౌమ్య 43,476 ఓట్లను సాధించారు. బీజేపీ అభ్యర్థి ముప్పై వేల ఓట్లను సాధించారు. ఇంకా 16 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నా ఎవరూ ప్రభావం చూపడం లేదు. వీరంతా వెయ్యి చిల్లర ఓట్లను సాధించారు ఇప్పటి వరకూ. ఈ నియోజకవర్గంలో జేడీఎస్ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికింది.





Untitled Document
Advertisements