విరాట్ సవాల్ కు బదులిచ్చిన మోదీ..

     Written by : smtv Desk | Wed, Jun 13, 2018, 11:58 AM

విరాట్ సవాల్ కు బదులిచ్చిన మోదీ..

ఢిల్లీ, జూన్ 13 : 'హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌' పేరుతో కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ చేసిన ఛాలెంజ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. రాజ్యవర్ధన్ సింగ్ పుష్ అప్స్ చేసిన వీడియో ను పోస్ట్ చేస్తూ హృతిక్‌ రోషన్‌, సైనా నెహ్వాల్‌, విరాట్‌ కోహ్లీకు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో వారు ఛాలెంజ్‌ను స్వీకరించి, కసరత్తులు చేస్తున్న వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. దీన్ని స్వీకరించిన కోహ్లీ తాను ఫిట్‌నెస్‌ కోసం చేసే కసరత్తులకు సంబంధించిన వీడియోను పోస్టు చేసి భార్య అనుష్క శర్మ, ప్రధాని నరేంద్ర మోదీ, సహచర ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోనీ ఈ సవాలును స్వీకరించాల్సిందిగా కోరాడు.

కోహ్లీ సవాలును స్వీకరించిన మోదీ.. త్వరలో నా ఫిట్‌నెస్‌ వీడియోను పోస్టు చేస్తానని ట్విటర్‌ వేదికగా బదులిచ్చారు. తాజాగా మోదీ ఫిట్‌నెస్‌ వీడియోను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. "యోగా కాకుండా నేను ప్రతి రోజు ఉదయం చేసే వ్యాయామాలివి. పంచభూతాలైన పృథ్వీ, జలం, అగ్ని, గాలి, ఆకాశం నుంచి నేను స్ఫూర్తి పొందాను. ఇలా చేయడం వల్ల నేను ఎంతో ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండగలుగుతున్నా" అని మోదీ పేర్కొన్నాడు.

తర్వాత ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఇటీవల ఆసీస్‌లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో నాలుగు పతకాలు సాధించిన మనిక బాత్రాతో పాటు దేశంలో నాలుగు పదులు పైబడిన ఐపీఎస్‌ అధికారులందర్నీ మోదీ కోరారు.
క్రీడాకారులు, బాలీవుడ్‌, టాలీవుడ్‌ కథానాయకులు ఒకరికొకరు ఈ ఫిట్‌నెస్‌ సవాలును విసురుకుంటూ ఇందుకు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తున్నారు.







Untitled Document
Advertisements