ఒక్క ట్వీట్.. జీవితాన్నే మార్చేసింది..

     Written by : smtv Desk | Wed, Jun 13, 2018, 12:33 PM

ఒక్క ట్వీట్.. జీవితాన్నే మార్చేసింది..

హైదరాబాద్, జూన్ 13 : పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ఒక్క ట్వీట్.. పేద దంపతుల జీవితాల్లో వెలుగులు నింపి౦ది. తెలంగాణ ప్రజల సమస్యలపై ఎవరు ట్వీట్ చేసినా తక్షణమే స్పందించే మంత్రి కేటీఆర్.. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ట్వీట్ పై కూడా వెంటనే స్పందించారు. కొమురంభీం-ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానెపల్లి మండలంలోని కర్జెల్లి ఎస్టీ కాలనీలో వృద్ధ దంపతులు నివాసముంటున్న గుడిసెకు స్థానిక అధికారులు రూ.500 ఇంటి పన్నును విధించారని ఉత్తమ్‌ మంగళవారం సీఎంవో, మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్ కు స్పందించిన కేటీఆర్.. జరిగిన తప్పిదాన్ని సరిదిద్దాలని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. వారికి డబుల్ బెడ్‌రూం ఇల్లు కేటాయించడంతోపాటు, ఆసరా పింఛన్ ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీకు కృతజ్ఞతలు అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి చూపిన చొరవకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆ పేద దంపతులు సంతోషంగా జీవించేందుకు చర్యలు తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఉత్తమ్ ట్వీట్ చేశారు.





Untitled Document
Advertisements