విన్నపాలు వినావలె..

     Written by : smtv Desk | Fri, Jun 15, 2018, 04:14 PM

విన్నపాలు వినావలె..

ఢిల్లీ, జూన్ 15 : తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో విభజన చట్టం హామీలతో పాటు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులకు సంబంధించి 10 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధానికి కేసీఆర్‌ అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ.20వేల కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి మొత్తం 10 వినతి పత్రాలు సమర్పించారు.

అందులో కొత్త జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలని, రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, మనోహరాబాద్‌-కొత్తపల్లి, అక్కన్నపేట-మెదక్‌ రైల్వే లైన్లను త్వరగా పూర్తిచేయాలని, కాజీపేట-కరీంనగర్‌ మధ్య రైల్వేలైన్‌ కోసం సర్వే చేయాలని, కొత్త సచివాలయం నిర్మాణానికి బైసన్‌ పోలో మైదాన స్థలాన్ని కేటాయించాలని, విభజన చట్టంలోని 9 వెనుకబడిన జిల్లాల(ఉమ్మడి జిల్లాలు) అభివృద్ధికి సహకరించాలని, రాష్ట్రానికి ఐఐఎం మంజూరు చేయాలని, హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ ప్రాజెక్టుకు చేయూత అందించాలని, జవహర్‌ నవోదయ విద్యాలయాల సంఖ్య పెంచాలని అందులో పేర్కొన్నారు.





Untitled Document
Advertisements