100 కోట్ల క్లబ్‌లో 'రేస్-3'...

     Written by : smtv Desk | Mon, Jun 18, 2018, 01:58 PM

100 కోట్ల క్లబ్‌లో 'రేస్-3'...

ముంబై, జూన్ 18: బాలీవుడ్ లో 'రేస్' సిరీస్‌లో వచ్చిన అన్ని చిత్రాలు సూపర్ హిట్ విజయం అందుకున్న విషయ౦ తెలిసిందే. 'రేస్', 'రేస్‌ 2' చిత్రాల్లో సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రధాన పాత్ర పోషించారు. అయితే సల్లూ భాయ్‌.. ఈద్‌ సెంటిమెంట్‌ తో 'రేస్‌-3 తో ప్రేక్షకులను అలరించడానికి వచ్చారు. కాగా ఈ సినిమా అతి సులభంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరుకుంది. ఇప్పటికే ఆయన నటించిన ‘బజరంగీ భాయ్‌జాన్‌’, ‘సుల్తాన్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాలు విడుదలైన మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసిన ఘనతను సొంతం చేసుకున్నాయి. కాగా ఈ చిత్రం శనివారం రూ.38.14 కోట్లు, ఆదివారం రూ.39.16 కోట్లు మొత్తం రూ.106.47 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన సల్మాన్‌ నాలుగో సినిమాగా ఈ చిత్రం నిలిచిందని ఆయన తెలిపారు.

రెమో డిసౌజా దర్శకత్వంలో సల్మాన్ తో పాటు.. అనిల్‌ కపూర్‌, బాబి డియోల్‌‌‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, డైసీ షా, సకిబ్‌ సలీమ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌, టిప్స్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రంజాన్‌ సందర్భంగా శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తొలిరోజున దాదాపు రూ.30 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్‌ సాధించిన బాలీవుడ్‌ చిత్రంగా రికార్డు సృష్టించింది.

Untitled Document
Advertisements