చై కోసం తమన్నా..

     Written by : smtv Desk | Mon, Jun 18, 2018, 02:44 PM

చై కోసం తమన్నా..

హైదరాబాద్, జూన్ 18 : అక్కినేని నాగచైతన్య.. చందుమొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం "సవ్యసాచి". మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై వై.నవీన్‌, వై.రవిశంకర్‌, మోహన్‌ (సీవీఎం) నిర్మిస్తున్నారు. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణా౦తర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమాలో తమన్నా ఒక ఐటమ్ సాంగ్ చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. నాగార్జున హిట్ సినిమా.. 'అల్లరి అల్లుడు' లోని 'నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయత్తు' సాంగ్ ను 'సవ్యసాచి' కోసం రీమిక్స్ చేయనున్నారు. చైతూ.. తమన్నాలపై ఈ నెలాఖరులో ఈ పాటను చిత్రీకరిస్తారట.

ప్రస్తుతం అందుకు సన్నాహాలు జరుగుతున్నాయనీ.. ఈ పాటతో షూటింగు పార్టు పూర్తవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి 'చై' డబ్బింగ్ పనులను ప్రారంభించారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌తో సరికొత్త హంగుల్ని జోడిస్తున్న ఈ చిత్రానికి 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' తో పాటు పలు ప్రతిష్టాత్మక చిత్రాలకి విజువల్‌ ఎఫెక్ట్స్‌ సమకూర్చిన మకుట సంస్థ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Untitled Document
Advertisements