శ్రియ, నిహారిక కాంబోలో కొత్త చిత్రం...

     Written by : smtv Desk | Mon, Jun 18, 2018, 04:08 PM

శ్రియ, నిహారిక కాంబోలో కొత్త చిత్రం...

హైదరాబాద్, జూన్ 18 : ప్రముఖ హీరోయిన్ శ్రియా శరణ్.. నిహారిక కొణిదెల కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను కొంతసేపటి క్రితమే లాంచ్ చేశారు. సినిమాటోగ్రఫర్ జ్ఞానశేఖర్ ఈ సినిమాతో నిర్మాతగా మారగా, సుజన దర్శకురాలిగా పరిచయమవుతోంది. పూర్తిగా కమర్షియల్ ఫార్ములాలో సాగనున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తుండటం విశేషం.

ఈ మూవీ ఆరంభ కార్యక్రమానికి దర్శకుడు క్రిష్.. హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిహారిక సోదరుడు వరుణ్ తేజ్ క్లాప్ ఇవ్వగా.. ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకుడిగా క్రిష్ వ్యవహరించారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతుందనీ, శ్రియ.. నిహారిక కెరీర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Untitled Document
Advertisements