అలా తీసిన సినిమానే "జెంటిల్ మెన్"..!

     Written by : smtv Desk | Mon, Jun 18, 2018, 04:58 PM

అలా తీసిన సినిమానే

హైదరాబాద్, జూన్ 18 : యాక్షన్ కింగ్ అర్జున్, శంకర్ కాంబోలో అప్పట్లో తెరకెక్కిన "జెంటిల్ మెన్" చిత్రం ఎంతటి ఘన విజయ౦ సాధించి౦దో అందరికి తెలిసిందే. ఆ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అయితే ఈ సినిమాకి ముందు జరిగిన ఒక సంఘటనను గురించి అర్జున్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒకప్పుడు తన సినిమాలన్ని వరుస పరాజయం పాలవుతుండడంతో కొంతమంది నిర్మాతలు ఆయనను తప్పించుకుని తిరగడం మొదలుపెట్టారట. అలాంటి పరిస్థితుల్లో ఉన్న అర్జున్.. తన ఇల్లు అమ్మేసుకుని తనే హీరోగా ఒక సినిమాను నిర్మించినట్లు తెలిపారు. అలా తీసిన ఆ సినిమా తనకు బాగా లాభాలు తెచ్చిపెట్టడమే కాకుండా.. మంచి క్రేజ్ ను తీసుకొచ్చిందని తెలిపారు.

ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా.. మళ్లీ దర్శక నిర్మాతలు క్యూ కట్టడం మొదలుపెట్టారని పేర్కొన్నారు. ఆ సమయంలో ఆయనకు అందరిపై కోపం వచ్చిందని.. తను కష్టాల్లో ఉన్నప్పుడు ముఖం చాటేసి ఇప్పుడు వస్తారా.? అంటూ అందరిని వెనక్కి పంపేశానన్నారు. అలా తన వద్దకు వచ్చిన వారిలో ఓ వ్యక్తి "కథ వినకుండా ఇలా వద్దు అని వెనక్కు పంపడం కరెక్ట్ కాదు సర్" అంటూ చెప్పడంతో ఒకసారి కథ వినడానికి ఓకే చెప్పాడట. అలా తీసిన సినిమానే "జెంటిల్ మెన్" అంటూ ఆనాటి క్షణాల్ని గుర్తుచేసుకున్నారు. "అలా నా సినిమా ద్వారా శంకర్ పరిచయమైనందుకు నేను ఇప్పటికీ గర్వపడుతుంటాను" అని చెప్పుకొచ్చారు.

Untitled Document
Advertisements