ఆ నిబంధన తెలియదు.. నన్ను క్షమించండి..

     Written by : smtv Desk | Mon, Jun 18, 2018, 05:16 PM

ఆ నిబంధన తెలియదు.. నన్ను క్షమించండి..

మాస్కో, జూన్ 18 : అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ స్టేడియాల్లో పొగ తాగకూడదన్న నిబంధనను ఉల్లంఘించడంపై అతనిపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఇటీవల అర్జెంటీనా-ఐస్‌లాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో మారడోనా స్టేడియంలో గ్యాలరీలో పొగ తాగుతూ కనిపించాడు. అయితే తనకు స్టేడియాల్లో పొగ తాగుకూడదనే నిబంధనను ప్రవేశపెట్టడం తెలియదంటున్నాడు. తన తప్పు తెలుసుకున్న ఆయన క్షమించాలని కోరాడు.

గతంలో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ పోటీలు జరిగే సమయంలో అభిమానులు పొగతాగేందుకు అనుమతి ఉండేది. కానీ, ఈ ఏడాది పోటీలు జరిగే సమయంలో స్టేడియం లోపల పొగ తాగడంపై టోర్నీ నిర్వాహకులు నిషేధం విధించారు. దీంతో మారడోనాపై చర్యలు తీసుకునే పనిలో అధికారులు ఉన్నారు . దీనిపై స్పందించిన మారడోనా 'స్టేడియంలో పొగ తాగకూడదన్న కొత్త నిబంధన గురించి నాకు నిజంగా తెలియదు. టోర్నీ నిర్వాహకులతో పాటు ప్రతి ఒక్కరినీ క్షమాపణలు కోరుతున్నాను' అని ఆయన పేర్కొన్నారు.

Untitled Document
Advertisements