రైల్వే జోన్ పై పాత పాటే పాడిన కేంద్రప్రభుత్వం..

     Written by : smtv Desk | Mon, Jun 18, 2018, 06:01 PM

రైల్వే జోన్ పై పాత పాటే పాడిన కేంద్రప్రభుత్వం..

ఢిల్లీ, జూన్ 18 : ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికగా ఉన్న రైల్వే జోన్‌ అంశంపై ప్రజలు సుదీర్ఘంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. కాగా విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు అంశంపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ పాత పాటే పాడింది. రైల్వే శాఖ గత నాలుగేళ్లలో చేపట్టిన పథకాలు తదితర అంశాలపై మీడియాతో మాట్లాడిన పీయూష్ గోయల్.. విశాఖ రైల్వే జోన్ అంశంపైనా స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కేవలం రైల్వే జోన్ అంశాన్ని పరిశీలించాలని మాత్రమే ఉందని చెప్పారు. ప్రస్తుతం మంత్రిత్వశాఖ పరిధిలోనే ఆ అంశం ఉందని తెలిపారు. తాను కూడా ఆ అంశాన్ని ఇప్పటికీ పరిశీలిస్తూనే ఉన్నానని మంత్రి తెలిపారు. ఈ అంశంపై ఇదిగో.. అదుగో.. అంటూ కేంద్రం నాన్చివేత ధోరణి అవలంబిస్తోంది. తొలుత ఒడిశా ఒప్పుకోవడం లేదని చెప్పిన కేంద్రం ఇప్పుడు ఈ అంశాన్ని పరిశీలిస్తూనే ఉన్నామని చెప్పడంతో జోన్‌ ఏర్పాటు చేయడం కేంద్ర ప్రభుత్వానికి ఇష్టంలేదనే వాదనలు వస్తున్నాయి.





Untitled Document
Advertisements