పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్..!!

     Written by : smtv Desk | Mon, Jun 18, 2018, 06:16 PM

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్..!!

హైదరాబాద్, జూన్ 18 : టాలీవుడ్ లో చాలా మంది అభిమానులు ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయమై ఆ మధ్య ప్రభాస్ పెద్దనాన్న, సీనియర్‌ నటుడు కృష్ణంరాజు కూడా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. 'డార్లింగ్‌'ను త్వరలోనే ఓ ఇంటి వాడిని చేయాలని సరైన వధువు కోసం చూస్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ ఓ ఆంగ్ల ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో తన పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. "అది నా వ్యక్తిగత విషయం. దాని గురించి చెప్పడం నాకు ఇష్టంలేదు, చెప్పాలి అనుకోవడం లేదు. నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మీడియాకు చెబుతాను" అంటూ కాస్త ఘాటుగానే స్పందించాడు. ప్రస్తుతం ప్రభాస్, సుజీత్‌ దర్శకత్వంలో "సాహో" చిత్రంలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్ర౦లో బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో కేవలం యాక్షన్‌ సన్నివేశాల కోసమే భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Untitled Document
Advertisements