మరొకరి భుజాలపై నడవటం తప్పే..

     Written by : smtv Desk | Mon, Jun 18, 2018, 06:34 PM

మరొకరి భుజాలపై నడవటం తప్పే..

హైదరాబాద్, జూన్ 18 : 'బాహుబలి' సిరీస్ లలో అనుష్క అందానికి ఫిదా కాని వారు ఉండరేమో. అంతలా తన నటనతో ఆకట్టుకుంది. ఆమె నటనకు అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు ప్రశంసలు దక్కాయి. 'దేవసేన' గా అభిమానులలో చెరగని ముద్ర వేశారు. అయితే ఈ సినిమాకు గానూ "బిహైండ్‌వుడ్స్‌‌ గోల్డ్‌ మెడల్‌‌" ఉత్తమ నటి అవార్డును అనుష్క అందుకున్నారు.అలాగే ఇదే 'బాహుబలి' సినిమాకు గానూ.. ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా రమా రాజమౌళి, ప్రశాంతి అవార్డు గెలుచుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి, ఉత్తమ సహాయ నటిగా రమ్యకృష్ణ అవార్డులు సొంతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా అవార్డు వరించినందుకు అనుష్క మాట్లాడుతూ.. 'దేవసేన' పాత్రకు నను ఎంచుకున్న రాజమౌళి కి ధన్యవాదాలు. నాకు అభిమానులందరి ప్రోత్సాహం నిరంతర ఉత్సాహాన్ని ఇస్తుంటుంది" అని చెప్పుకొచ్చారు. అలాగే ప్రభాస్‌ భుజాలపై నడవడం సరైనదేనా.? అనే ప్రశ్నకు బదులిస్తూ.. 'మరొకరి భుజాలపై నడవటం తప్పే. కానీ 'బాహుబలి' సినిమాలో అలాంటి పాత్ర పోషించడం 'దేవసేన' తప్పు కాదు" అంటూ తనదైన రీతిలో సమాధానమిచ్చారు.





Untitled Document
Advertisements