స్వీడన్.. గెలిచన్..

     Written by : smtv Desk | Mon, Jun 18, 2018, 09:10 PM

స్వీడన్.. గెలిచన్..

మాస్కో, జూన్ 18 : ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా 'గ్రూప్‌ ఎఫ్' ‌లో నేడు జరిగిన మ్యాచ్‌లో స్వీడన్‌ జట్టు.. దక్షిణ కొరియాపై 1-0 తేడాతో గెలుపొందింది. దీంతో ప్రపంచకప్‌లో స్వీడన్‌ బోణీ చేసింది. మ్యాచ్‌ 65వ నిమిషంలో స్వీడన్‌కు లభించిన పెనాల్టీను.. స్వీడన్‌ డిఫెండర్‌ ఆండ్రియాస్‌ గ్రాన్‌క్విస్ట్‌ గోల్‌గా మలిచాడు. దీంతో స్వీడన్‌కు 1-0 ఆధిక్యం లభించింది. అదే ఆధిక్యాన్ని మ్యాచ్‌ చివరి వరకు స్వీడన్ నిలబెట్టుకొంది. 2002లో నైజీరియాతో జరిగిన మ్యాచ్‌ తర్వాత ప్రపంచ కప్‌లో స్వీడన్‌ గోల్‌ కొట్టిన తొలి పెనాల్టీ ఇదే కావడం గమనార్హం.

దక్షిణ కొరియాతో తలపడిన చివరి ఐదు సార్లు స్వీడన్‌ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌కు మరో విశేషం కూడా ఉంది. 1958లో జరిగిన ప్రపంచకప్‌లో స్వీడన్‌ ఆడిన తొలిమ్యాచ్‌లో మెక్సికోపై 3-0తేడాతో గెలిచింది. ఆ తర్వాత జరిగిన ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌ల్లో నెగ్గలేదు. ఐదు సార్లు ఓడిపోగా.. రెండు సార్లు ఫలితం తేలలేదు.





Untitled Document
Advertisements