రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని..

     Written by : smtv Desk | Tue, Jun 19, 2018, 01:39 PM

రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని..

ఢిల్లీ, జూన్ 19 : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ 48 వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు, పార్టీ కార్యకర్తలు రాహుల్‌ పేరున పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీ రాహుల్‌ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను' అని మోదీ ఈరోజు ఉదయం ట్వీట్‌ చేశారు. రాహుల్‌ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా యూత్‌ కాంగ్రెస్‌ ‘రన్‌ ఫర్‌ రాహుల్ గాంధీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రజస్వామ్యం కోసం ప్రతి ఒక్కరు పోరాడాలనే సందేశాన్ని ప్రచారం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.

రాహుల్‌ గాంధీ 2017 డిసెంబరు 11న ఏకగ్రీవంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతకుముందు 2013 జనవరిలో ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. రాహుల్‌ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఇదే మొదటి పుట్టినరోజు. సోనియా గాంధీ దాదాపు 19ఏళ్ల పాటు పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగిన అనంతరం తన కుమారుడు రాహుల్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించారు.





Untitled Document
Advertisements