ఏ పార్టీకి మేము మద్దతు ఇవ్వం : ఒమర్‌ అబ్దుల్లా

     Written by : smtv Desk | Tue, Jun 19, 2018, 05:48 PM

ఏ పార్టీకి మేము మద్దతు ఇవ్వం : ఒమర్‌ అబ్దుల్లా

శ్రీనగర్‌, జూన్ 19 : జమ్ముకశ్మీర్‌‌లో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడిన విషయం తెలిసిందే. దీంతో సీఎం పదవికి పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. ఈ విషయంపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వొహ్రాను కలిశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.." ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు లేవు. ఏ పార్టీకి మేము మద్దతు ఇవ్వబో౦. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కోసం మేము ఎవరినీ కలవలేదు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించామని గవర్నర్‌ను కోరాను. పీడీపీ-భాజపా పొత్తు వీగిపోవడంపై మేము సంబరాలు చేసుకోవడం లేదు. నిజానికి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీకి గురైంది. అందుకు బాధపడుతున్నా౦" అని ఒమర్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.





Untitled Document
Advertisements