అరవింద్‌ సుబ్రమణియన్‌ సంచలన నిర్ణయం..

     Written by : smtv Desk | Wed, Jun 20, 2018, 03:58 PM

అరవింద్‌ సుబ్రమణియన్‌ సంచలన నిర్ణయం..

న్యూఢిల్లీ, జూన్ 20 : ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కుటుంబంతో కలిసి ఉండేందుకు అరవింద్‌ సుబ్రమణియన్‌ తిరిగి అమెరికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ఈ వివరాలు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతో అరవింద్‌ సుబ్రమణియన్‌ ఈ నిర్ణయం తీసుకోవడంతో దానికి ఆమోదం తెలపడం మినహా మరో మార్గం లేదని జైట్లీ అన్నారు. పలు కీలక ఆర్థిక నిర్ణయాల్లో ప్రధాన ఆర్థిక సలహాదారుగా అరవింద్‌ సుబ్రమణియన్‌ చురుకైన పాత్ర పోషించారు.

అరవింద్ సుబ్రహ్మణ్యం పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్‌లో సీనియర్ ఫెలో. ఆయనను ప్రధాన ఆర్థిక సలహాదారుగా 2014 అక్టోబరులో నియమించారు. ఆయన పదవీ కాలం 2017 అక్టోబరు 16న ముగిసింది. అనంతరం ఓ ఏడాదిపాటు పొడిగించారు. ఆర్థిక సలహాదారు పదవి కేవలం ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించడం మాత్రమే కాదని కీలక నిర్ణయాల ప్రభావం, పర్యవసానాలనూ అంచనా వేయగలగాలని, ఇవన్నీ అరవింద్‌ సుబ్రమణియన్‌లో పుష్కలంగా ఉన్నాయని జైట్లీ ప్రశంసించారు.





Untitled Document
Advertisements