రేపే అంతర్జాతీయ యోగా డే..

     Written by : smtv Desk | Wed, Jun 20, 2018, 06:11 PM

రేపే అంతర్జాతీయ యోగా డే..

ఢిల్లీ, జూన్ 20 : నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా రేపు జూన్ 21 (గురువారం) న జరుపుకోనున్నారు. 2014 సెప్టెంబరు 27 న ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. యోగాను వెలకట్టలేని అమూల్యమైన పురాతన భారతీయ సంప్రదాయంగా పేర్కొన్నారు. యోగాను అంతర్జాతీయంగా అనుసరించేలా కృషిచేయడానికి తోడ్పాటునందించాలని మోదీ ఐరాసను కోరారు. దీంతో జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినంగా గుర్తిస్తూ 2014 డిసెంబరు 11 న ఐరాస ప్రకటించింది. అప్పటి నుండి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.

యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే అంతర్జాతీయ యోగా దినోత్సవం ముఖ్యోద్దేశం. యోగా అనే పదం సంస్కృత‌ంలోని యుజ అనే దాని నుంచి వచ్చింది. యుజ అంటే చేరడం లేదా ఏకంచేయడం అని అర్థం. శరీరం, మనసును ఏకచేయడమే యోగాలోని పరమార్థం. దాదాపు 5000 ఏళ్ల చరిత్ర కలిగిన యోగశాస్త్రం ప్రపంచానికి భారతీయులు అందించిన అద్భుతమైన కానుక.‘శాంతి కోసం యోగా’ అనే నినాదంతో ఈ ఏడాది యోగా దినోత్సవం నిర్వహించునున్నారు.

Untitled Document
Advertisements