పోర్చుగల్‌ ఇన్.. మొరాకో ఔట్..

     Written by : smtv Desk | Thu, Jun 21, 2018, 11:11 AM

పోర్చుగల్‌ ఇన్.. మొరాకో ఔట్..

మాస్కో, జూన్ 21 : ఫిఫా ప్రపంచ కప్ లో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో జోరు కొనసాగుతుంది. తొలి మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ స్పెయిన్‌ను 3–3తో నిలువరించిన పోర్చుగల్ గ్రూప్‌ ‘బి’లో బుధవారం మొరాకోను 1–0తో ఓడించింది. ఆ జట్టు తరఫున ఏకైక గోల్‌ను 4వ నిమిషంలో హెడర్‌ ద్వారా కెప్టెన్‌ క్రిస్టియానో రొనాల్డో సాధించాడు. ఈ గెలుపుతో పోర్చుగల్‌ నాలుగు పాయింట్లతో నాకౌట్‌ దశకు చేరువ కాగా... ఓటమితో మొరాకో ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టయింది.

నాకౌట్లో రష్యా, ఉరుగ్వే ..

ప్రపంచకప్‌ నాకౌట్లో అడుగుపెట్టిన తొలి రెండు జట్లుగా ఉరుగ్వే, రష్యా నిలిచాయి. గ్రూపు-ఏలో సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో విజయం సాధించి ఉరుగ్వే రెండో రౌండ్‌ దిశగా అడుగులు వేసింది. గ్రూపులో అన్ని జట్లూ రెండేసి మ్యాచ్‌లు ఆడగా.. రెండింటికి రెండూ గెలిచి ఉరుగ్వే, రష్యా తుది-16లో ప్రవేశించాయి. ఆడిన రెండూ ఓడిపోయి ఈజిప్ట్‌, సౌదీ అరేబియా జట్లు నాకౌట్‌ రేసు నుంచి వైదోలిగాయి. సోమవారం ఉరుగ్వే, రష్యా మధ్య మ్యాచ్‌లో గెలిచే జట్టు గ్రూప్‌ విజేతగా అవతరించనుంది.

Untitled Document
Advertisements