రన్ మెషిన్.. మిస్టర్ కూల్.. దాదా.. 183..

     Written by : smtv Desk | Thu, Jun 21, 2018, 02:59 PM

రన్ మెషిన్.. మిస్టర్ కూల్.. దాదా.. 183..

హైదరాబాద్‌, జూన్ 21 : సౌరభ్‌ గంగూలీ.. మహేంద్ర సింగ్‌ ధోనీ.. వీరిద్దరూ ఒకప్పుడు భారత క్రికెట్ జట్టు కెప్లెన్లు. విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం టీమిండియా సారథిగా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ 183 ఏంటి అనుకుంటున్నారా..!. జెర్సీ నెంబర్ల, లేకపోతే గెలిపించిన మ్యాచ్ ల టీమిండియా తరఫున 183 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించారా అంటే అదీ కాదు. మరేంటి అనుకుంటున్నారా..! అయితే ఇది చదివేయండి. కోహ్లీ, ధోనీ, గంగూలీ ఈ ముగ్గురికి 183కి సంబంధం ఏంటంటే. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఈ ముగ్గురి వ్యక్తిగత అత్యధిక స్కోరు 183 కావడం విశేషం. ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ వ్యక్తిగత అత్యధిక స్కోరు నమోదు చేసిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ విజయం సాధించడం మరో విశేషం.

>> సౌరభ్‌ గంగూలీ: 1999లో ప్రపంచకప్‌లో గంగూలీ తన వ్యక్తిగత అత్యధిక స్కోరును నమోదు చేశాడు. టోర్నీలో భాగంగా శ్రీలంకతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గంగూలీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 157 పరుగుల తేడాతో విజయం సాధించింది.

>> మహేంద్ర సింగ్‌ ధోనీ: 2005లో ధోనీ 183 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన 7 వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో ధోనీ తన వ్యక్తిగత అత్యధిక స్కోరును నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించి 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

>> విరాట్‌ కోహ్లీ: భారత పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ 2012లో ఈ క్లబ్‌లో చేరాడు. ఆసియా కప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 183 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోరును సాధించాడు. 330 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు.










Untitled Document
Advertisements