'విజేత' నుండి 'కొక్కొరోకో' సాంగ్..

     Written by : smtv Desk | Thu, Jun 21, 2018, 04:18 PM

'విజేత' నుండి 'కొక్కొరోకో' సాంగ్..

హైదరాబాద్, జూన్ 21 : మెగాస్టార్‌ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్‌ 'విజేత' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. వారాహి చలన చిత్ర బ్యానర్‌పై రాకేశ్‌ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కేకే సెంథిల్‌ కుమార్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ దేవ్ సరసన మాళవికా నాయర్‌ కథానాయికగా నటిస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం ప్రకారం.. రేపు ఉదయం 8 గంటల 9 నిమిషాలకి కోడికి సంతాపాన్ని తెలియజేస్తూ హీరో పాడే 'కొక్కొరోకో.. ' పాటను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చికెన్ షాప్ దగ్గర నిలబడి అలా మారిపోయిన కోడిని తలచుకుని ఏడుస్తూ కళ్యాణ్ దేవ్ కనిపిస్తున్నాడు. 'కోడి' మీద మసాలా సాంగ్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. కాగా ఈ నెల 24వ తేదీన ఆడియో వేడుకను ఘనంగా జరపనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Untitled Document
Advertisements