మిల్క్ వ్యాపారంలోకి అడుపెట్టిన దగ్గుబాటి..

     Written by : smtv Desk | Thu, Jun 21, 2018, 06:23 PM

మిల్క్ వ్యాపారంలోకి అడుపెట్టిన దగ్గుబాటి..

హైదరాబాద్, జూన్ 21 : ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. స్వచ్ఛమైన పాలను అందించేందుకు ఆయన పొలం బాట పట్టారు. ప్రస్తుతం ఆర్గానిక్ ఫుడ్ పై అందరికీ ఆసక్తి పెరుగుతోంది. కాని మార్కెట్లో లభిస్తున్న పాలు, కూరగాయల్లో రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటీవలే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ప్రజలకు స్వచ్ఛమైన పాలు, సేంద్రీయ సేద్యంతో కూరగాయలు అందించాలనే నిర్ణయానికి వచ్చారు.

ఇందుకోసం హైదరాబాద్ నగర శివార్లలో తనకు ఉన్న 30 ఎకరాల వ్యవసాయ భూమిలో 30 ఆవులను పెంచుతున్నారు. 'హ్యాపీ ఆవులు' పేరుతో స్వచ్ఛమైన పాల ఉత్పత్తికి సురేష్ బాబు శ్రీకారం చుట్టారు. లీటరు పాలను రూ. 150కి విక్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. డబ్బు సంపాదించాలనే ధ్యేయంతో తాను ఈ పని చేయడం లేదని కేవలం స్వచ్ఛమైన పాలకు, బయట దొరుకుతున్న పాలకు ఉన్న తేడా ఏమిటో ప్రజలకు తెలియజేయాలనేదే ఉద్దేశంతో ఈ పనికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.

Untitled Document
Advertisements