భారత్ X ఐర్లాండ్ : సోనీలో ప్రత్యక్ష ప్రసారం..

     Written by : smtv Desk | Fri, Jun 22, 2018, 11:03 AM

భారత్ X ఐర్లాండ్ : సోనీలో ప్రత్యక్ష ప్రసారం..

ఢిల్లీ, జూన్ 22 : టీమిండియా జట్టు కోహ్లీ సారథ్యంలో త్వరలో ఐర్లాండ్‌ పర్యటనకు బయలదేరనుంది. పర్యటనలో భాగంగా ఆతిథ్య ఐర్లాండ్‌తో భారత్‌ రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నెల 27, 29న ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏ ఛానెల్‌లో ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడాలి అన్న సందేహం ప్రతి ఒక్క అభిమాని మదిలో ఉంటుంది. భారత్‌లో ఈ మ్యాచ్‌ ప్రసార హక్కులను సోనీ దక్కించుకుంది. సోనీ సిక్స్‌, సోనీ టెన్‌ 3లో ఈ రెండు మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అలాగే సోనీ లైవ్‌ యాప్‌ ద్వారా కూడా మీ మొబైల్‌లో ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌ వేదికగా ఈ రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటల నుంచి ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Untitled Document
Advertisements