'సర్కార్' గా రానున్న ఇళయదళపతి..

     Written by : smtv Desk | Fri, Jun 22, 2018, 11:36 AM

'సర్కార్' గా రానున్న ఇళయదళపతి..

హైదరాబాద్, జూన్ 22 : కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్‌ ప్రస్తుతం మురగుదాస్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ రిలీజ్‌ను చిత్రయూనిట్‌ విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరించారు. సన్‌పిక్చర్స్‌ బ్యానరుపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు "సర్కార్‌" అని పేరుపెట్టారు. రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో విజయ్‌, మురగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు సూపర్‌ హిట్ కావటంతో ప్రస్తుతం హ్యాట్రిక్‌ దిశగా ఆలోచన చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ లుక్ కు సంబంధించి పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Untitled Document
Advertisements