నాగ్ కు వైద్యం చేసే పాత్రలో నాని..!

     Written by : smtv Desk | Fri, Jun 22, 2018, 11:58 AM

నాగ్ కు వైద్యం చేసే పాత్రలో నాని..!

హైదరాబాద్, జూన్ 22 : అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని కలిసి మల్టీస్టారర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో నేను గ్యాంగ్ స్టర్ గా నటిస్తే.. నాకు వైద్యం చేసే డాక్టర్ పాత్రలో నాని కనిపిస్తాడు. చాలా సరదాగా సాగిపోయే పాత్ర అంటూ పేర్కొన్నారు.

ఒకే చిత్రంలో ఇద్దరు హీరోలు నటిస్తే సమస్య రాదా...? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. "ఇతర నటుల కారణంగా నా కెరీర్‌ పాడవుతుందని నేనెప్పుడూ భయపడలేదు. ఇటీవల వస్తున్న మల్టీస్టారర్‌ కథలతో చిత్రాలు చేయడం సంతోషంగా ఉంది. 'ఊపిరి'లో కార్తితో పనిచేయడం భలే సరదా అనిపించింది. నానితో కూడా అలాగే ఉంది" అంటూ నవ్వుతూ చెప్పేశారు. అలాగే ప్రియదర్శన్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారన్న వార్తలపై స్పందిస్తూ.. ప్రియదర్శన్‌ను కలిశాను. కానీ, స్క్రిప్ట్‌ వినలేదు. ప్రస్తుతానికి నానితో కలిసి నటిస్తున్న చిత్రంలో బిజీగా ఉన్నా" అంటూ చెప్పుకొచ్చారు.

Untitled Document
Advertisements