మాస్ చిత్రంతో రానున్న మెగా హీరో..!

     Written by : smtv Desk | Fri, Jun 22, 2018, 11:59 AM

మాస్ చిత్రంతో రానున్న మెగా హీరో..!

హైదరాబాద్, జూన్ 22 : మెగా హీరోల్లో ఇంచు మించు అందరూ మాస్ హీరోలుగా ఎదిగేందుకు ఉత్సాహం చూపుతారు. క్లాస్ ఎలిమెంట్స్ ఉన్నా.. మాస్ సినిమాలు చేయడానికే ఇష్టపడతారు. కానీ ఒక్క వరుణ్ తేజ్ మాత్రమే ఇందుకు మినహాయింపుగా నిలుస్తున్నాడు. తొలి చిత్రం 'ముకుంద' నుండి 'కంచె', 'ఫిదా', 'తొలిప్రేమ' ఇలా అన్నీ క్లాస్ సినిమాలే చేసి మెగా ప్రిన్స్ హిట్ కొట్టాడు. ఈ మధ్యలో 'లోఫర్' అంటూ ఓ మాస్ మూవీ కూడా చేశాడు కానీ ఆ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం క్లాస్ ఆడియన్స్ కు బాగా దగ్గరైన ఈ హీరో.. ఇప్పుడు మాస్ ప్రేక్షకులపై కూడా దృష్టి పెట్టాడు. ఏ సెంటర్లతో పాటు బీ-సీ క్లాస్ ఆడియన్స్ ను కూడా మెప్పించేందుకు వీలుగా ఓ కథ చేయాలని ఉత్సాహం చూపిస్తుండగా.. తాజాగా దర్శకుడు సాగర్ చంద్ర చెప్పిన కథను సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసినట్లు తెలుస్తోంది.

'అయ్యారే', 'అప్పట్లో ఒకడుండేవాడు' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న ఈ దర్శకుడు.. ఇప్పుడు వరుణ్ తేజ్ తో సరికొత్త కథతో మాస్ సినిమా చేయనున్నాడని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ ను కూడా ఫైనల్ చేసేశారని తెలుస్తోంది. ఇటీవల 'సమ్మోహనం' మూవీతో మెప్పించిన బ్యూటీ అదితి రావు హైదరిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో కలిసి సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్ష నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలో అదితి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements