వైరల్ : ప్రియుడితో ప్రియాంక..

     Written by : smtv Desk | Fri, Jun 22, 2018, 12:59 PM

వైరల్ : ప్రియుడితో ప్రియాంక..

హైదరాబాద్, జూన్ 22 : బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా.. గత కొంత కాలంగా హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల నిక్ జోనాస్ ఫ్యామిలీ కి చెందిన ఒక ప్రైవేట్ వేడుకకు ప్రియాంక చోప్రా ప్రత్యేక అతిధిగా రావడమే కాక ఇద్దరూ చేతులు జోడించి కొత్త జంటలా పెళ్లికి హాజరయ్యారు. ఆ తర్వాత ఎక్కడ పార్టీ జరిగినా.. వీరిద్దరూ కలిసే వెళ్తున్నారు. దీంతో త్వరలోనే ప్రియాంక పెళ్లి చేసుకోనున్నారన్న వార్త బాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది.

తాగాజా వీరిద్దరూ సీక్రెట్ గా ముంబై చేరుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేడు తెల్లవారుజామున ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయి ఎవరి కంటా పడకుండా విమానాశ్రయం నుంచి బయటకు వచ్చారు. కాని ఎట్టకేలకు కారులో వెళతుండగా కెమెరా కంటికి చిక్కారు. ఎయిర్ పోర్ట్ నుంచి నిక్ తో పాటు జుహులోని తన ఇంటికి చేరుకుంది ప్రియాంక. నిక్ ను తన తల్లికి పరిచయం చేయడానికే తనను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రియాంక తల్లి.. ఇదివరకే ప్రియాంక పెళ్లిపై ఒక క్లారిటీ ఇచ్చింది. ఒక విదేశీయుడిని తన కూతురు పెళ్లి చేసుకోవడాన్ని మాత్రం అంగీకరించనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Untitled Document
Advertisements