మాస్ ఆడియన్స్ ను అలరిస్తున్న 'కొక్కొరోకో'..

     Written by : smtv Desk | Fri, Jun 22, 2018, 01:21 PM

మాస్ ఆడియన్స్ ను అలరిస్తున్న 'కొక్కొరోకో'..

హైదరాబాద్, జూన్ 22 : మెగాస్టార్‌ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్‌ 'విజేత' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. కోడికి సంతాపాన్ని తెలియజేస్తూ హీరో పాడే 'కొక్కొరోకో.. ' పాటను రిలీజ్ చేశారు. ముందుగా ఈ పాటలో చికెన్ లోని రకాలు చెబుతూ.. మాకు బలాన్ని ఇస్తూ బలైపోతావు.. శ్రద్ధాంజలి నీకు.. అంటూ కోడి ఫోటోకి దండేశారు.

రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన స్టెప్స్ మాస్ ఆడియన్స్ ను అలరించేవిగా వున్నాయి. వారాహి చలన చిత్ర బ్యానర్‌పై రాకేశ్‌ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కేకే సెంథిల్‌ కుమార్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ దేవ్ సరసన మాళవికా నాయర్‌ కథానాయికగా నటిస్తోంది.





Untitled Document
Advertisements