టీమిండియాతో తలపడే ఐర్లాండ్‌ జట్టు ఇదే..

     Written by : smtv Desk | Fri, Jun 22, 2018, 02:09 PM

టీమిండియాతో తలపడే ఐర్లాండ్‌ జట్టు ఇదే..

డబ్లిన్, జూన్ 22 ‌: కోహ్లీ సేనతో తలపడే ఐర్లాండ్‌ జట్టును ఆ దేశ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. త్వరలో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత జట్టు ఐర్లాండ్‌లో పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ నెల 27న తొలి టీ20, 29వ తేదీన రెండో టీ20 జరుగనుంది. దీనిలో భాగంగా ఐర్లాండ్‌ కూడా 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. గ్యారీ విల్సన్‌ ఐర్లాండ్‌ జట్టుకు సారథ్యం వహించనున్నాడు.

డబ్లిన్‌లోనే ఈ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐర్లాండ్‌ పర్యటన ముగించుకున్న అనంతరం కోహ్లి సేన అటు నుంచి నేరుగా ఇంగ్లండ్‌ పర్యటనకు బయల్దేరనుంది. జులై 3 నుంచి ఇంగ్లాండ్‌-భారత్‌ మధ్య టీ20 సిరీస్‌ ప్రారంభంకానుంది.

ఐర్లాండ్‌ జట్టు: గ్యారీ విల్సన్‌ (కెప్టెన్‌), ఆండ్రూ బాల్‌బిర్ని, పీటర్‌ చేజ్‌, జార్జ్‌ డాక్‌రెల్‌, జాష్‌ లిటిల్‌, ఆండ్రూ మెక్‌బ్రైన్‌, కెవిన్‌ ఓబ్రియన్‌, విలియమ్‌ పోర్టర్‌ఫీల్డ్‌, స్టువర్ట్‌ పోయంటర్‌, బోయడ్‌ రాన్‌కిన్‌, జేమ్స్ షన్నాన్‌, సిమి సింగ్‌, పాల్‌ స్టిర్లింగ్‌, స్టువర్ట్‌ థాప్సన్‌

ఐర్లాండ్‌కు వెళ్లే భారత జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, సురేశ్‌ రైనా, మనీష్‌ పాండే, ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యా, దినేశ్‌ కార్తీక్‌, యజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, బూమ్రా, సిద్దార్థ్‌ కౌల్‌, ఉమేశ్‌ యాదవ్‌

Untitled Document
Advertisements