ఆ బోల్డ్ సీన్ పై స్పందించిన కైరా..

     Written by : smtv Desk | Fri, Jun 22, 2018, 02:28 PM

ఆ బోల్డ్ సీన్ పై స్పందించిన కైరా..

హైదరాబాద్, జూన్ 22 : 'భరత్ అనే నేను' చిత్రం ద్వారా తెలుగు తెర‌కు పరిచయమై తొలి సినిమాతోనే ఘ‌న‌విజయం అందుకున్న హీరోయిన్ కైరా అద్వానీ. ఈ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ.. ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'లస్ట్‌ స్టోరీస్‌'. శృంగార కోరిక‌లు ఎక్కువ‌గా గ‌ల గృహిణి పాత్ర‌లో బోల్డ్ గా నటించిన కైరాను పలువురు ప్రశంసిస్తే.. పలువురు ఆమెపై విమర్శలు విసురుతున్నారు.

తాజాగా ఈ విషయంపై కైరా స్పందించింది. "ఇది పూర్తిగా పెద్ద‌ల కోసం తీసిన సినిమా. మొద‌ట నాకు స్క్రిప్టు చెప్పిన‌ప్పుడు ఈ సీన్ లేదు. షూటింగ్ స‌మ‌యంలో ఈ సీన్ యాడ్ చేశారు. ఆ సీన్ చేస్తేనే స‌బ్జెక్ట్‌కు న్యాయం చేసిన‌ట్టు అవుతుంద‌ని నాకు అనిపించింది. చిత్ర‌బృందం చాలా స‌హ‌క‌రించింది కాబ‌ట్టే.. ఎంతో మంది మ‌గాళ్లు ఉండ‌గా ఆ సీన్‌లో న‌టించాను. ఆ సీన్ చేసినందుకు నేను ప‌శ్చాత్తాపం చెంద‌డం లేదు" అంటూ చెప్పుకొచ్చింది.

కరణ్‌ జోహార్‌, అనురాగ్‌ కశ్యప్, దివాకర్‌ బెనర్జీ, జోయా అక్తర్‌ సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాధికా ఆప్టే, భూమి పెడ్నేకర్‌, మనీషా కొయిరాలా, నేహా ధుపియా ప్రధాన పాత్రలు పోషించిన 'ల‌స్ట్ స్టోరీస్' ఇంట‌ర్నెట్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

Untitled Document
Advertisements