ఆ వార్తలను కొట్టిపారేసిన నయన్..

     Written by : smtv Desk | Fri, Jun 22, 2018, 02:49 PM

ఆ వార్తలను కొట్టిపారేసిన నయన్..

హైదరాబాద్, జూన్ 22 : భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది హీరోయిన్ నయనతార. క‌థానాయిక ప్రాధాన్య‌మున్న సినిమాల్లోనూ న‌టిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను సృష్టించుకుంది. అయితే ఈ అమ్మడు గత కొంతకాలంగా దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో వున్న విషయం తెలిసిందే.

తాజాగా ప్రియుడితో కలిసి నయన్.. ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విఘ్నేష్ రూపొందిస్తున్న 'ఇద‌యం ముర‌ళీ' సినిమాకు నయన‌తారే నిర్మాత‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వార్త‌ల‌ను న‌య‌న్ కొట్టిపారేసింది. 'నేను నిర్మాత‌గా మారాన‌న్న‌ది పూర్తిగా అవాస్త‌వం. ఆ వార్త‌ల‌ను నమ్మ‌కండి. నేను ప్ర‌స్తుతం న‌ట‌న‌పైనే పూర్తి దృష్టి కేంద్రీక‌రించా" అంటూ చెప్పుకొచ్చారు. కాగా నయన్.. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన భర్త అంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసి౦ది.

Untitled Document
Advertisements